అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన బిపర్‌జాయ్ మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతున్నదని, ఈనెల 15 నాటికి పాకిస్థాన్, దానిని ఆనుకుని ఉన్న సౌరాష్ట్ర, కచ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం అది ముంబైకి దక్షిణంగా 600 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.