Monday, February 24, 2025
Homeసినిమా'కీడా కోలా' టీజర్‌ విడుదల

‘కీడా కోలా’ టీజర్‌ విడుదల

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ క్రైమ్‌ కామెడీ ‘కీడా కోలా’ చిత్రం. నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.టీజర్‌లో కామెడీ బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో కనిపించగా, తరుణ్ భాస్కర్‌ లోకల్ డాన్‌గా కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. ఇక, ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో చైతన్య రావు మాదాడి, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజి సైన్మా మొదటి ప్రొడక్షన్ బ్యానర్ పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్