Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: జగనన్న సురక్ష తొలిరోజు సూపర్ సక్సెస్

YS Jagan: జగనన్న సురక్ష తొలిరోజు సూపర్ సక్సెస్

ప్రజల సమస్యలు పరిష్కరించడమే  ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  జగనన్న సురక్ష కార్యక్రమానికి  నేడు తొలి రోజు  అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1305 గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ సేవల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఈ శిబిరాల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ముఖ్యంగా వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు సమయం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదాయం, కుల సహా పెద్ద సంఖ్యలో వివిధ సర్టిఫికెట్లను అందుకున్నారు.

అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ది అందకుండా మిగిలి పోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం – జగనన్న సురక్ష.  ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహసారధులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు.

ఈనెల 23న జనగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రారంభించిన తర్వాత సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటినీ జల్లెడపెట్టారు. అర్హత ఉండీ, వివిధ కారణాల వల్ల పథకాలు అందకపోయినా, సర్టిఫికెట్లు పొందలేకపోయినా.. వారి వివరాలు సేకరించారు. ఈ సర్వీసులన్నింటినీ రిజిస్టర్‌ చేసిన వారికి టోకెన్లు ఇచ్చారు. ఆయా మండలాలకు చెందిన అధికారులు… వీటిని పరిశీలించి.. జగనన్న సురక్షా క్యాంపులకు వెళ్లేముందే పూర్తిస్తాయిలో సన్నధ్దం అయ్యారు.

జులై 1న అంటే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రతి మండలానికీ 2 క్యాంపులు చొప్పున అంటే ప్రతి మండలంలో రెండు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. అక్కడిక్కడే సర్టిఫికెట్లు జారీచేసేందుకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నారు. మంచి నెట్‌ ఉండేలా, బ్యాండ్‌ విడ్త్‌ ఉండేలా ముందస్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దాదాపుగా ఎలాంటి సమస్యలు లేకుండా తొలిరోజు పైరులకు సేవలు అందించగలిగారు.

క్యాంపులు రిసెప్షన్‌ డెస్క్‌ సర్వీసు రిజిస్ట్రేషన్‌ డెస్క్‌ లేదా జగనన్నకు చెబుదాం డెస్క్, వెరిఫికేషన్‌ డెస్క్‌, ఆధార్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసుకున్నారు. తొలిరోజు 1305 సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించగా, ఇందులో 22,728 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 14,28,481 మంది కుటుంబాలను కవర్‌ చేశారు.

తొలిరోజు క్యాంపుల్లో 4,42,840 సర్వీసులు రిజిస్టర్‌ కాగా, అక్కడికక్కడే 3,69,373 సర్టిఫికెట్లు జారీచేశారు. ఎలాంటి రుసులు లేకుండా పూర్తి ఉచితంగా ఈసేవలు అందుకున్నారు.ఈ ప్రభుత్వం రాకముందు గతంతో రెండు మూడు గ్రామాలకు ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు సచివాలయ పరిధిలో కనీసం 10 నుంచి 11 మంది ఉద్యోగులు ఉన్నారు.దీంతో ఇలాంటి క్యాంపులు ద్వారా సేవలు మరింత విస్తృతం అయ్యాయి. అంతేకాకుండా నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతున్నాయి. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్యసేవలుకూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు.

జులై 1 నుంచి నెలరోజులపాటు 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సురక్ష క్యాంపులను నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్