Family Counselling :
Q.మా అమ్మాయికి అయిదేళ్లక్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమహోదాలోఉన్నవారే. చిన్నచిన్నసమస్యలతో రెండేళ్లక్రితం విడిపోయారు. పిల్లలు
లేరు. ఎంత చెప్పినా వినడం లేదు. కౌన్సిలింగ్ కి వెళ్ళమంటే వొద్దంటున్నారు. వీళ్ళని కలిపే మార్గం ఉందా ?
-లక్ష్మి
A.చదువు మన ఆలోచనా పరిధిని విస్తృతం చేయాలి. ఎదుటివారిని అర్థం చేసుకునే తత్త్వం పెరగాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే భావన రావాలి. అప్పుడే ఆ చదువు సార్ధకం అయినట్లు. దురదృష్టవశాత్తూ మీ అమ్మాయి, అల్లుడు ఈ విషయం పట్టించుకున్నట్టు లేరు. ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుని సహకరించుకోవలసింది పోయి లేనిపోని ఇగోలతో చికాకులు కొని తెచ్చుకుంటున్నారు. విడిపోయి రెండేళ్ళయిందంటున్నారు కాబట్టి విడాకులకు వెళ్లడమే మేలు. పిల్లలు లేరు కనుక పెద్దగా ఇబ్బంది లేదు. అయినా ఇప్పటికీ మీరు వాళ్లిద్దరూ కలవాలనే కోరుకుంటున్నారు కాబట్టి చివరి ప్రయత్నంగా ఇద్దరితో విడిగా మాట్లాడి అపోహలు తొలగించే ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితంలో సర్దుబాటు అనేది ఎంతముఖ్యమో వివరించండి. ఇందుకు మీ అల్లుడి తల్లిదండ్రుల సహకారమూ తీసుకోండి. ఇంతమందిపెద్దల శుభకామనలు ఆ ఇద్దరినీ కలుపుతాయనే ఆశిద్దాం.
Family Counselling
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read: