ప్రపంచంలో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాల దశను ఉన్నత విద్య కు అనుసంధానం చేయాలని, పాఠ్యప్రణాళిక కూడా సమ్మిళితం చేయాలని, ఇది ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై క్యాంపు కార్యాలయంలో హైపవర్ వర్కింగ్ గ్రూపుతో జగన్ సమావేశమయ్యారు. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి ప్రఖ్యాఖ సంస్ధల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
“ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరం. ఇండియాలో ఏఐ వంటి వర్టికల్స్ అభివద్ధి చాలా తక్కువగా ఉంది. వాటిని బోధించే సిబ్బంది కొరత కూడా ఎక్కువుగా ఉంది. ఉదాహరణకు ఫైనాన్స్ సబ్జెక్ట్‌నే తీసుకుంటే… బీకామ్ కాకుండా మరో వర్టికల్ ఇందులో లేదు. బికామ్‌లో ఫైనాన్స్‌కు సంబంధించిన ఇతర వర్టికల్స్ ఏవీ అందుబాటులో లేవు. అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి. రిస్క్ మేనేజిమెంట్, అసెట్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, ఫైనాన్స్ వంటి అంశాలను కరిక్యులమ్‌లో భాగంగా చేయాలి. ఎందుకు వీటిని కరిక్యులమ్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకునిరాలేకపోతున్నామంటే.. ఈ వర్టికల్స్‌ను బోధించే సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడమే. వీటికి సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉన్నా అమల్లోకి తీసుకునిరాలేని పరిస్థితి. వెస్టర్న్ వరల్డ్‌లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉంది, ఇవన్నీ అక్కడ కరిక్యులమ్‌లో భాగంగా ఉన్నాయి” అంటూ సిఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సిఎం చేసిన పలు సూచనలు….
- ఐబీతో కలిసి ఒక కొత్త సిలబస్‌ను రూపొందించబోతున్నాం. అది దేశానికే బెంచ్‌మార్క్ కాబోతుంది.
- రాబోయే రోజుల్లో ఐబీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌తో కలిసి టీచింగ్ మెథడాలజీని, పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నాం.
- దీనికి మీ లాంటి వ్యక్తులు, సంస్థల సహకారం అవసరం. అప్పుడు కల సాకారమవుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం.
- ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌ను పాఠశాల స్ధాయికే పరిమితం చేయకుండా.. ఉన్నత విద్యలో కూడా ప్రవేశపెట్టాలి.
- సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను చేర్చగలిగితే… మంచి ఫలితాలు వస్తాయి.
- ఈ మార్పులను తేగలిగితే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేనాటికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది.
- కొన్నికోర్సుల కోసం ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది ? అదే సబ్జెక్ట్‌లను మన దేశంలో బోధిస్తే… వర్చువల్‌గా వాటిని అందుబాటులోకి తీసుకునిరాగలిగితే ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది.
- వర్చువల్ టీచింగ్, వర్చువల్ కంటెంట్ అందుబాటులోకి తీసుకునిరావాలి.
- ఇంజనీరింగ్, మెడిసిన్‌లో సాంప్రదాయ విధనాల్లో కూడా మార్పులు రావాలి. రోబోటిక్స్ ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉంది. వీటిమీద దృష్టి పెట్టాలి.
- వచ్చే సమావేశం నాటికి ఒక స్పష్టమైన విధానం తీసుకురావాలి.
- అదే సమయంలో ఉన్నత విద్యలో కూడా ఒకవైపు పరీక్షా విధానం, మెథడాలజీ, బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి సారించాలి.
- మరోవైపు వెస్టర్న్ వరల్డ్ తరహాలో మరిన్ని వర్టికల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై అధ్యయనం చేయాలి.
- వర్చువల్ టీచింగ్, వర్చువల్ కంటెంట్ అందుబాటులోకి తేవాలి.
- మూడో అంశం.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులను… కరిక్యులమ్‌లో భాగంగా చేయాలి.
- ఇంజనీరింగ్, మెడిసిన్‌లో ఎలా భాగస్వామ్యం చేయాలన్నదానిపై అధ్యయనం చేయాలి.
- మరింత సమగ్రంగా, సులభంగా అర్ధమయ్యేలా, ఆచరణీయంగా ఉండేలా మార్పు చేయాలి.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్క్ లీడ్ డాక్టర్ విన్నీ జౌహరి, ఇంటెల్ సీనియర్ డైరెక్టర్(ఏసియా పసిఫిక్ అండ్ జపాన్) శ్వేత ఖురానా, నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంధ్య చింతాల, ప్రైమస్ పార్టనర్స్ ఇండియా కో పౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ చారు మల్హోత్ర, ప్రైమస్ పార్టనర్స్ ఇండియా ఎడ్యుకేషన్ కన్సెల్టెంట్ పూజ క్వాత్రా, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ పౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ జైజిత్ భట్టాచార్య, అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ స్కిల్స్ టు జాబ్స్ (ఇండియా అండ్ సౌత్ ఏసియా) డిపి సింగ్, గూగుల్ లీడ్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ గరిమెళ్ల, మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ప్రొగ్రామ్ మేనేజర్ కిషోర్ గార్గ్, డేటావివ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ వేదాంత్ అహ్లువాలియా, డేటావివ్ బోర్డు మెంబర్ అతుల్ కుమార్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సమగ్రశిక్షా అభియాన్ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి ఎన్ దీవాన్ రెడ్డి, పలువురు ఇతర ఉన్నతాధికారులు హాజరు.