Sunday, November 24, 2024
HomeTrending NewsBuggana: 'గార్కో 10'ను సందర్శించిన బుగ్గన

Buggana: ‘గార్కో 10’ను సందర్శించిన బుగ్గన

వియత్నాంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం ఆ దేశ  ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమైంది.  వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై చర్చలు జరిగాయి.  వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ట్రంగ్ అంగీకరించారు,   ఆ తర్వాత  వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్ ను కూడా బుగ్గన కలుసుకున్నారు,  హనోయిలోని ఇండియా హౌస్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ ‘గార్కో 10’ను సందర్శించి, ఈ సంస్థ  సహకారంతో  ఏపీలో  వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీ ని కూడా సందర్శించి టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని కోరారు.

వియత్నాంలోని హనోయ్ లో భారత రాయబారి సందీప్ ఆర్యాను బుగ్గనబృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. బుగ్గన వెంట  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్