Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కోవిడ్ పై నివేదిక ఇవ్వండి – హైకోర్టు ఆదేశం

కోవిడ్ పై నివేదిక ఇవ్వండి – హైకోర్టు ఆదేశం

అనంతపురంలో కోవిడ్ మరణాలపై నివేదిక ఇవ్వాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఏపి కోరిన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దూర ప్రాంతాల నుంచి కాకుండా బళ్ళారి, తమిళనాడు నుంచి సరఫరా చేయాలని పేర్కొంది.
ఆక్సిజన్ లో స్వయం సంమృద్ధి సాధించడానికి ఎలాటి చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ పెంచాలని సూచన చేసింది.
రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచాలన్న కోరలు వాక్సినేషన్ ప్రక్రియపై కూడా ఆరా తీసింది. ఏళ్ళ లోపువారికి వాక్సిన్ ఎప్పుడు అందిస్తారో చెప్పాలి అడిగింది. తదుపరి విచారణను హైకోర్ట్ వెకేషన్ బెంచ్ కు వాయిదా వేసింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్