జపాన్ ఓపెన్-2023లో నేడు రెండో రోజు భారత ఆటగాళ్ళు లక్ష్య సేన్, సాత్విక్ సాయి రాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు.
పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ 21-16; 11-21; 21-13 తేడాతో ఇండోనేషియా ద్వయం లియో రాలీ-డానియెల్ మార్టిన్ పై విజయం సాధించారు.
పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ మన దేశానికే చెందిన ప్రియాన్షు రాజావత్ పై 21-15; 12-21; 24-22 తేడాతో గెలుపొందాడు.
కాగా, గత కొంత కాలంగా విఫలమవుతోన్న స్టార్ ప్లేయర్ పివి సింధు ఈ టోర్నీలో కూడా తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. 21-12;21-13 తో సింధుపై చైనా ప్లేయర్ ఝాంగ్ ఈ మన్ విజయం సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ లో మాళవిక బన్సోద్ పై 21-7;21-15 తో జపాన్ క్రీడాకారిణి ఆయా ఒహోరి నెగ్గింది.
పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో మిథున్ మంజునాథ్ పై చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యాంగ్ 13-21; 24-22; 21-18 గెలుపొందాడు.
పురుషుల డబుల్స్ మ్యాచ్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల ఆడుతుండగా అర్జున్ కు గాయం కావడంతో రిటైర్ తీసుకున్నాడు.