చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భోళా శంకర్’. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటించింది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కూడా వాల్తేరు వీరయ్య రేంజ్ లో సక్సెస సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు కానీ.. ఇది రీమేక్ మూవీ కావడంతో కామన్ ఆడియన్స్ లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయనే ఫీలింగ్ కలిగించింది కానీ.. వావ్ అనిపించలేదు.
ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా రీమక్ కాబట్టి.. పైగా ఫ్లాపుల్లో ఉన్న మెహర్ రమేష్ డైరెక్టర్ కాబట్టి సినిమా అంతగా ఆడుతుందో లేదో అని ఆలోచించారే ఏమో కానీ.. చిరు ఒక్క పైసా కూడా రెమ్యూనరేష్ తీసుకోకుండా నటించారట. లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పారట. మేకర్స్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు విక్రయించారు. తాజా వార్తల ప్రకారం.. సినిమా డిజిటల్ హక్కుల నుండి పెద్ద మొత్తాన్ని రాబట్టారట. ఈ చిత్రం విడుదలయ్యాక, చిరంజీవికి కలెక్షన్లలో ప్రధాన వాటా ఉంటుందట. అయితే.. నిర్మాతలు ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే లాభాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చెల్లెలుగా నటించగా, కీర్తి సురేష్ లవర్ గా సుశాంత్ నటించారు. ఈ భోళా శంకర్ ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ముఖ్యంగా అభిమానులకు నచ్చేలా మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని రూపొందించారని టీజర్ అండ్ ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అన్నయ్య చిరంజీవి ఇమిటేడ్ చేయడం ఆసక్తిగా మారింది. మరి.. బాక్సాఫీస్ దగ్గర భోళా శంకర్ ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.