కర్నాటకలో మోరల్ పోలీసింగ్ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. భిన్న మతాలకు చెందిన బాలుడు, బాలిక చిక్‌బళ్లాపూర్‌లో రెస్టారెంట్‌కు వెళ్లడంతో వారిపై కొందరు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెస్టారెంట్‌లో తన క్లాస్‌మేట్ ముస్లిం బాలికతో ఓ యువకుడు భోజనం చేస్తుండగా కొందరు యువకులు లోపలికి వచ్చి వారిని వేధింపులకు గురిచేశారు.వేరే వర్గానికి చెందిన వ్యక్తితో ఎందుకు సన్నిహితంగా మెలుగుతున్నావని బాలికను ప్రశ్నించారు. ఆపై బాలిక వెంట వచ్చిన యువకుడిపై వారు దాడికి పాల్పడినట్టు సమాచారం.
దాడికి తెగబడిన యువకులను బాలిక వారించినా వారు వినిపించుకోలేదు. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని బాలిక స్పష్టం చేసింది. ఘటనపై బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.