Sunday, January 19, 2025
HomeTrending NewsGuyana: గయానాలో అగ్ని ప్రమాదం... 20 మంది మృతి

Guyana: గయానాలో అగ్ని ప్రమాదం… 20 మంది మృతి

దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరికొంతమంది గాయపడినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్‌ గుయానా మైనింగ్‌ పట్టణంలోని మహదియా సెకండరీ స్కూల్‌ లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో చనిపోయింది విద్యార్థుల, ఉపాధ్యాయుల, ఇతరుల అనే విషయం తెలియరాలేదు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్