Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్ దేవరకొండ నో చెప్పిన హిట్ సినిమాలు...

విజయ్ దేవరకొండ నో చెప్పిన హిట్ సినిమాలు…

ఒక హీరో కోసం కథ రాస్తే.. మరోక హీరోకి సెట్ కావడం అనేది కామన్. అలా జరగడం వలన  హిట్లు, ఫ్లాప్ లు కూడా తారుమారవుతుంటాయి.  అయితే.. ఒక హీరో నో చెప్పిన కథ వేరే హీరోకు బ్లాక్ బస్టర్  ఇస్తే అయ్యో ఆ సినిమా తాను చేసి ఉండాల్సిందని ఫీల్ కావడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న హిట్ సినిమాల సంఖ్య ఎక్కువే ఉంది. ఈ  జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఉప్పెన. ఈ చిత్రాన్ని వైష్ణవ్ తేజ్ తో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది.  వైష్ణవ్ తేజ్ చేయడానికి కొన్ని ఏళ్ల క్రితమే ఆ కథను విజయ్ దేవరకొండ విన్నాడట కానీ.. ఎందకనో నో చెప్పాడట. ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. నితిన్ హీరోగా నటించిన భీష్మ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రాన్ని కూడా ముందుగా విజయ్ దేవరకొండకు చెప్పారట కానీ.. ఆయన నో చెబితే అప్పుడు నితిన్ దగ్గరకి వెళ్లిందట. ఇలా ఉప్పెన, భీష్మ చిత్రాలను విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలే కాదండోయ్.. పూరి జగన్నాథ్ తెరక్కించిన ఇస్మార్ట్ శంకర్ కూడా ముందుగా విజయ్ దగ్గరికే వచ్చిందట.

అలాగే సుప్రసిద్థ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన సీతారామం కోసం కూడా ముందుగా విజయ్ దేవరకొండనే అనుకున్నారట. ఆ బ్యానర్ లో విజయ్ దేవరకొండ మహానటి సినిమాలో నటించాడు. అయితే.. విజయ్ కి సీతారామం కథ నచ్చింది కానీ.. డేట్స్ కుదరకపోవడం వలన ఆయన ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారని తెలిసింది. విజయ్ మిస్ చేసుకున్న ఉప్పెన, భీష్మ, ఇస్మార్ట్ శంకర్, సీతారామం చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. ఈ సినిమాలు విజయ్ చేసుంటే.. అతని కెరీర్ మరో రేంజ్ లో ఉండేది.

Also Read : అల్లు అర్జున్ అన్న నాకు స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

RELATED ARTICLES

Most Popular

న్యూస్