Sunday, January 19, 2025
HomeTrending NewsMorocco: మొరాకోలో భారీ భూకంపం...300 మంది మృతి

Morocco: మొరాకోలో భారీ భూకంపం…300 మంది మృతి

మధ్యదార సముద్ర తీరంలోని ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి 11.11 గంటలకు మొరాకోలోని మర్రకేష్‌ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది.

రాజధాని రాబాట్‌కు (Rabat) 320 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. రాబాత్ నుంచి మర్రకేష్ వరకు వచ్చిన భారీ భూ ప్రకంపనలతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భయంభయంగా రాత్రంతా రోడ్లపైనే గడిపారు.

భూకంపం ధాటికి చాలా భవనాలు దెబ్బతిన్నాయి. భూకంపం ధాటికి భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటివరకు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మర్రకేష్‌లోనే 210  మంది చనిపోయారు. మరో రెండు వందల మంది గాయపడ్డారు.

సహారా ఎడారిని అనుకుని ఉన్న మొరాకో దేశం పర్యాటక రంగంపైనే ఎక్కువగా ఆధారపడింది. భూకంపం ధాటికి పర్యాటకుల్లో విదేశీయులు ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. 2004లో అల్‌ హొసీమాలో వచ్చిన భూకంపంతో 628 మంది మరణించారు. మరో 926 మంది గాయపడ్డారు. ఇక 1980లో ఎల్‌ అస్నామ్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించింది. దీనివల్ల 2500 మంది మృత్యువాతపడగా, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్