Monday, February 24, 2025
HomeTrending Newsప్రజాకవి కాళోజీకి ఘన నివాళి

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి

Solid Tribute To The Public Poet Kaloji :

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియం లో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 19 వ వర్ధంతి (13.11.2002) సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు.., నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలన కి వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడు గా అభివర్ణించారు. కాళోజీ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత సీఎం కేసీఆర్ కి కాళోజీ రచనలు, కవిత్వం అంటే ఎంతో అభిమానమన్నారు.

పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు మన కాళోజీ నారాయణ రావు అని అభివర్ణించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాకవి కాళోజీని గౌరవిస్తూ వారి జన్మదినం (సెప్టెంబర్ – 9) ను ‘తెలంగాణ భాషా దినోత్సవం‘ గా జరుపుతున్నామన్నారు. అలాగే, వరంగల్ లో నెలకొన్న ‘ఆరోగ్య విశ్వవిద్యాలయానికి’, హన్మకొండ పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కళాక్షేత్రం’ కు పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు పేరును పెట్టి గౌరవిస్తూన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా DCCB వైస్ ఛైర్మన్ కొరమోని వెంకటయ్య, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రో. జయధీర్ తిరుమల రావు, ప్రో. మనోజ తదితరులు పాల్గొన్నారు.

Also Read : జాతీయ గాన కోకిల డి.కె.పట్టమ్మాళ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్