Saturday, November 23, 2024
HomeTrending NewsRegularization: వైద్యారోగ్య శాఖలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ

Regularization: వైద్యారోగ్య శాఖలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యానికి శాఖలోని ఏడు విభాగాల్లోని మొత్తం 1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉత్తర్వు ప్రతులను ఆయా యూనియన్ల ప్రతినిధులకు స్వయంగా అందజేసిన మంత్రి హరీశ్ రావు

కుటుంబ సంక్షేమ విభాగంలో 68 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 72, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 156 ఫార్మసిస్ట్, 177 ల్యాబ్ టెక్నీషియన్, 2 పారామెడికల్ ఆప్తలమిక్ ఆఫీసర్, 837 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) 837, ఆయుష్ విభాగానికి చెందిన 19 మంది మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే మొత్తం 1331 మంది క్రమబద్దీకరణ పొందారు. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ చేయడం పట్ల యూనియన్ల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతోమంది కలను సాకారం చేసి, జీవితాల్లో వెలుగు నింపారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ని జన్మాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు. మంత్రి హరీశ్ రావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్