Sunday, January 19, 2025
Homeసినిమా'ఆర్ య పార్' వెబ్ సిరీస్ లో ఏవుంది? 

‘ఆర్ య పార్’ వెబ్ సిరీస్ లో ఏవుంది? 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్నటి నుంచి 8 ఎపిసోడ్స్ గల ‘ఆర్ య పార్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. వివిధ భాషలతో పాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ను అందుబాటులో ఉంచారు. అడవిని నమ్ముకుని ఒక గిరిజన గూడెం ఉంటుంది. ఆ ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉన్నాయని తెలుసుకున్న ఒక బిజినెస్ మేన్, తన పరపతిని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్య లేకుండా చూసుకోగల సత్తా ఉన్న వ్యక్తి అతను. కానీ అడవి ప్రాంతంలోని గిరిజనులను ఖాళీ చేయించడమే కష్టం.

తనకు అనుకున్నది సాధించడానికి ఆ బిజినెస్ మేన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేదే కథ అనే విషయం ట్రైలర్ చూసినవారికి అర్థమైపోతుంది. ‘ఆల్రెడీ ఈ తరహా కథలు చాలానే వచ్చాయి కదా .. ఇందులో కొత్తదనం ఏవుంది?’ అనుకోవడం సహజం. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఖనిజ సంపదను దక్కించుకోవడం కోసం తమ ప్రాణాలను కబళిస్తున్న బిజినెస్ మేన్ పై .. అతని అనుచర వర్గంపై ఒక గిరిజన యువకుడు విల్లు ఎక్కు పెడతాడు. తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం అడవినే కాదు .. దేశాలను దాటుకుంటూ వెళతాడు. అందుకు దర్శకుడు చూపించిన అవకాశాలు కూడా కరెక్టుగానే అనిపిస్తాయి.

ఆదిత్య రావెల్ .. ఆశిష్ విద్యార్థి .. పత్రలేఖ పౌల్ .. దివ్యేన్దు భట్టాచార్య .. సుమీత్ వ్యాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, నిర్మాణ విలువల పరంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. కథా పరంగా కూడా మంచి మార్కులే పడతాయి. కథనం విషయానికి వస్తే .. ప్రతి ఎపిసోడ్ లోను కొత్త పాత్రలు ఎంటరవుతుంటాయి. కొన్ని పాత్రలు సరిగ్గా రిజిస్టర్ కాకపోవడం వలన చిన్నపాటి అయోమయం కలుగుతుంది. కొన్ని పాత్రల ఉద్దేశం .. స్వభావం కూడా అర్థం కాదు. చిత్రీకరణ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా .. యాక్షన్ సీన్స్ పరంగా మాత్రం ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుందని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్