Saturday, January 18, 2025
Homeసినిమాఏ.ఎమ్.రత్నం క్లాప్‌తో ‘ప్యాకప్’ చిత్రం ప్రారంభం

ఏ.ఎమ్.రత్నం క్లాప్‌తో ‘ప్యాకప్’ చిత్రం ప్రారంభం

Packup: పిజిపి ప్రొడక్షన్స్ (పానుగంటి ప్రొడక్షన్స్) బ్యానర్ పై వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతర ర‌త్నం మాట్లాడుతూ.. ‘ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో వాసం నరేశ్ మాట్లాడుతూ  ‘‘ముందుగా మా టీమ్‌ను ఆశీర్వదించిన రత్నం గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం అనేక టర్న్‌లు తీసుకుని, ఇప్పుడు భారీగా తెరకెక్కేందుకు రెడీ అయింది. మంచి టీమ్ కుదిరింది. ఖచ్చితంగా మంచి హిట్ కొడతామనే ఆశతో ఉన్నాం. ఇటువంటి కథతో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.

హీరోయిన్ ఆశ ప్రమీల మాట్లాడుతూ ‘‘డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం నేను డాక్టర్‌. ఈ చిత్రంతో యాక్టర్‌గా మారుతున్నాను. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను’’ అని అన్నారు.

డైరెక్టర్ జివిఎస్ ప్రణీల్ మాట్లాడుతూ  “నూతన హీరో,హీరోయిన్లను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. మంచి కథ.. యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రేమలో ఉండే ఒక వైవిధ్యకోణాన్ని ఈ చిత్రంతో చెప్పబోతున్నాం’’ అని తెలిపారు

Also Read : మార్చి 4న ‘సెబాస్టియన్‌ పిసి 524’

RELATED ARTICLES

Most Popular

న్యూస్