Saturday, January 18, 2025
Homeసినిమాజూలై 8 నుంచి రంగంలోకి ‘ఆచార్య’

జూలై 8 నుంచి రంగంలోకి ‘ఆచార్య’

మెగాస్టార్‌ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధా అనే కీలక పాత్రస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం.. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. జూలై 8 నుంచి ఆచార్య సెట్స్ పైకి రానుందని తెలిసింది. 12 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 7 రోజుల పాటు జరిగే షూటింగ్‌లో రామ్‌చరణ్‌ పాల్గొంటారు. ఈ షెడ్యూల్ లో ఓ యాక్షన్ సీన్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆచార్య విడుదల ఎప్పుడు అనేది ప్రకటిస్తారని సమాచారం. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంటే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మూవీని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్