Sunday, January 19, 2025
Homeసినిమాఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎప్పుడు? ఎక్క‌డ‌?

ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎప్పుడు? ఎక్క‌డ‌?

Acharya:  మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆచార్య చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను పక్కాగా సెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే.. హిందీ రిలీజ్ గురించి అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయాల్సివుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత‌కీ ఎప్పుడు అంటే.. ఏప్రిల్ 24న స‌మాచారం. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ప్రీ రిలీజ్ వేడుక‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీనికి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి కూడా అనుమ‌తులు వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక వేడుక‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య‌ అతిథులుగా రానున్నారని టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఇదే క‌నుక జ‌రిగితే.. ఒకే వేదిక పై చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ ను చూసే భాగ్యం మెగాభిమానుల‌కు దక్కనుంది

Also Read :ఆచార్య హిందీ రిలీజ్ ఉందా?  లేదా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్