వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియా ముచ్చటగా మూడో స్వర్ణ పతకం సాధించింది. ఈ తెల్లవారుజామున జరిగిన పోటీలో భారత ఆటగాడు అచింత షూలీ 73 కిలోల విభాగంలో స్నాచ్- క్లీన్ అండ్ జర్క్ విభాగంలో మొత్తం 313 కిలోల బరువు ఎత్తడం ద్వారా పసిడి పతకం ఒడిసి పట్టుకున్నాడు.
2019, 2021 సంవత్సరాల్లో కామన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచినా అచింత 2021 తాష్కెంట్ లో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజత పతకం సాధించాడు. ఈ అన్ని పోటీల్లోనూ 73కిలోల విభాగంలోనే ఈ ఘనత సాధించాడు షూలీ.
ఈ స్వర్ణంతో ఇండియా ఇప్పటికి మొత్తం ఆరు పతకాలు సంపాదించగా వీటిలో మూడు స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యం ఉన్నాయి.
Also Read : CWG-2022: స్వర్ణం సాధించిన జెరేమీ