Sunday, November 24, 2024
Homeసినిమాహర్రర్ మూవీ పెద్ద ఛాలెంజ్ : సాయిధరమ్ తేజ్

హర్రర్ మూవీ పెద్ద ఛాలెంజ్ : సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’.  కార్తీక్ దండు దర్శకత్వంలో  రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంయుక్తమీనన్ కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా  విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ  ఓ కార్యక్రమాన్ని యూనిట్ నిర్వహించింది.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్‌లో ఈ కథ విన్నాను. ముందుగా సుకుమార్ నుంచి కాల్ వచ్చింది. కథ విను.. ఖచ్చితంగా నీకు నచ్చుతుంది. చేస్తావ్ అని అన్నారు. సుకుమార్ గారు కదా?.. ఏదో లవ్ స్టోరీ చెబుతారని అనుకున్నా. కానీ నన్ను భయపెట్టాడు డైరెక్టర్ కార్తీక్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు కార్తీక్‌కు హ్యాట్సాఫ్. శ్యాం గారి కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్. నాగేంద్ర గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష ప్రపంచాన్ని అద్భుతంగా రూపొందించారు. కార్తీక్ విజన్‌కు అజనీష్‌ ప్రాణం పోశారు. బీజీఎం అదరగొట్టేశారు. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నటీనటుల సహకారంతోనే నేను నటించగలిగాను.

సునీల్, సాయి చంద్, బ్రహ్మాజీ, అజయ్, సంయుక్త ఇలా అందరూ నాకు ఎంతగానో సహకరించారు. నాకు సెట్‌లో ఆరోగ్యం బాగా లేకపోయినా నాకోసం షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మా నిర్మాతలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను సపోర్ట్ చేసిన విరూపాక్ష టీం, సుకుమార్ గారికి థాంక్స్. ఈ సినిమాకు కథే హీరో. హార్రర్ సినిమా చూడటమే ఓ చాలెంజింగ్. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్. తారక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మేం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే ఇచ్చారు. నా కోసం, నిర్మాత బాపి గారి కోసం, సుకుమార్ గారి కోసం వెంటనే ఓకే చెప్పారు. ఇప్పుడు సినిమాను చూసే విధానం మారింది కాబట్టి. మంచి సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఓ ఫిక్షన్ స్టోరీ అందరికీ రీచ్ అవుతుందని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్