సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకం పై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి నిర్మించిన చిత్రం ’చేరువైన… దూరమైన’. సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై.. చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ‘కమెడియన్ శ్రీనివాసరెడ్డి నాకు ఎంతో ఆప్తమిత్రుడు. ఇండస్ట్రీలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. నా స్ట్రగుల్స్ లో తోడుగా వున్నారు. నా స్టోరీస్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు. 2008 నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఆయన మేనల్లుడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చా. సుజిత్ కి మంచి భవిష్యత్ వుంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. తప్పకుండా ఈ చిత్రం హిట్ అవుతుంది” అన్నారు. సుజిత్ కి మంచి స్టోరీ తయారు చేసి సినిమా తీయాలని శ్రీనివాసరెడ్డి కోరగా… అలాగే తప్పకుండా చేద్దాం అంటూ నవ్వూతూ ప్రసంగం ముగించారు.
హీరో సుజిత్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరో నైనా కూడా నిర్మాతలు నన్ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టి.. ఈ సినిమాను తీశారు. వారికి ఎంతో రుణపడి వున్నా. దర్శకుడితో నాకున్న అనుబంధం లాంగ్ జర్నీ. నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఈ సినిమాను తీశారు. నాతో నెక్ట్స్ సినిమా కూడా తీస్తా అన్నారు. చాలా థ్యాంక్స్. సుకుమార్ మంచి సంగీతం అందించారు. తరుణి సింగ్ చాలా సపోర్ట్ చేసి నటించారు. టామ్ అండ్ జెర్రీలాగా నటించి కంప్లీట్ చేశాం. శశి కూడా చాలా సపోర్ట్ గా నిలిచి ప్రోత్సహించారు. ఈ చిత్రం టీజర్ ను గోపీచంద్ మలినేని లాంఛ్ చేసి ఆశీర్వదించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ట్రైలర్ లాంఛ్ చేసి… మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. నేను కమెడియన్ శ్రీనివాసరెడ్డి అల్లుడిని అని ఎప్పూడూ ఎక్కడా చెప్పలేదు. ఈ రోజు చెబుతున్నా. ఎందుకుంటే… తను నన్ను సొంతంగా ఎదగాలని చెప్పారు. అందులో భాగంగానే ఎప్పూడూ రివీల్ చేయలేదు. ఈ రోజు గర్వంగా ఆయన అల్లుడిని అని చెబుతున్నా’ అన్నారు.
హీరో మేనమామ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘నా మేనల్లుడిని ఆశీర్వదించండి. ఈ చిత్రంలో సుజిత్ బాగా చేశారు. ముఖ్యంగా ఎంతో కష్టంగా అనిపించిన క్లైమాక్స్ సీన్ కూడా ఎంతో బాగా చేశారు. తప్పకుండా అందిరికీ నచ్చుతుంది. ఈ చిత్ర టీమ్ ను ఆశీర్వదించండి’ అన్నారు. ఈ కార్యక్రమంలో విలన్ గా నటించిన శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు వెంకీ (కబడ్డీ కబడ్డీ) తదితరులు పాల్గొన్నారు.