Sunday, January 19, 2025
Homeసినిమా'ఆదిపురుష్' పై కస్తూరి విమర్శలు.. మండిపడుతున్న అభిమానులు

‘ఆదిపురుష్’ పై కస్తూరి విమర్శలు.. మండిపడుతున్న అభిమానులు

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత అంచనాలు అమాంతం పెరిగాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత స్పీడు పెంచారు. ప్రభాస్ ప్రమోషన్స్ కోసం యు.ఎస్ వెళ్లారు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ మూవీ పై సీనియర్ హీరోయిన్ కస్తూరి విమర్శలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ కస్తూరి ఏమన్నదంటే.. ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన రాముడిలా లేరని, కర్ణుడిలా ఉన్నారని అన్నారు. రాముడిని, లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు సినిమాల్లో ఎంతో మంది నటులు రాముడి పాత్రల్లో తెర పై ఎంతో అందంగా కనిపించారని… కానీ ప్రభాస్ మాత్రం కర్ణుడిలా కనిపిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యల పై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

ఇదే కాకుండా.. సీత దగ్గరకు హనుమంతుడు వెళ్లినప్పుడు ఆమె గుర్తు గాజు ఇచ్చినట్టు ట్రైలర్ లో చూపించారు. దీని పై కూడా విమర్శలు వచ్చాయి. ఇలా ఆదిపురుష్ రిలీజ్ కాకుండానే విమర్శలు వస్తున్నాయి. రిలీజ్ తర్వాత ఇంకెన్ని విమర్శలు వస్తాయో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా పై విమర్శలు ఉన్నప్పటికీ… క్రేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంది. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో భారీగా ఓపెనింగ్ రానుందని.. కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయమనే టీమ్ గట్టి నమ్మకంతో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్