Saturday, January 18, 2025
Homeసినిమానమిత కోరిక తీరేనా?

నమిత కోరిక తీరేనా?

తెలుగు, తమిళ సినిమాలలో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నమిత. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన నమితకు ఆతర్వాత సరైన అవకాశాలు రాకపోవడం.. కెరీర్ లో వెనకబడడంతో ఆమధ్య పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నమిత థియేటర్ పేరుతో ఓటీటీ ప్రారంభించబోతుంది. కరోనా టైమ్ లో థియేటర్లు మూతపడడం.. ఓటీటీలకు టైమ్ రావడం జరిగింది. కొన్ని సౌత్ అండ్ నార్త్ భాషలలోని సినిమాలు ఓటీటీలలోనే రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

ఓటీటీ సంస్థలు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలను భారీ మొత్తానికి ముందుకొస్తున్నాయి. తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా పేరుతో ఓటీటీని ప్రారంభించడం.. ఇది అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందడంతో తెలుగులో మరిన్ని ఓటీటీలు రాబోతున్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సొంత ఏటీటీ, ఓటీటీల ద్వారా తన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా సొంతంగా ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

సౌత్ హీరోయిన్ నమిత కూడా నమిత థియేటర్ పేరుతో ఓటీటీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా నమిత మాట్లాడుతూ.. మా ఓటీటీ ద్వారా చిన్న- మీడియం బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే.. ఇప్పుడు ఓటీటీకి పోటీ బాగా పెరిగింది. ఈ ఓటీటీ రంగంలో నమిత విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్