Saturday, February 22, 2025
Homeసినిమాతమన్నా దూకుడు తగ్గడమే లేదే!

తమన్నా దూకుడు తగ్గడమే లేదే!

టాలీవుడ్ తెరను ఎక్కువ కాలం పాటు ఏలేసిన అందమైన భామలలో తమన్నా ఒకరు. తెలుగు .. తమిళ భాషల్లో ఒకే సమయంలో స్టార్ హీరోయిన్ గా తమన్నా చక్రం తిప్పేసింది. అలాగే బాలీవుడ్ లోను మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. ఆ మధ్య తమన్నా హవా తగ్గినట్టేనని అందరూ అనుకుంటూ ఉండగానే, మళ్లీ ఆమెను భారీ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అదే సమయంలో బాలీవుడ్ వెబ్ సిరీస్ ల నుంచి కూడా ఆమెకి భారీ ఆఫర్లు వచ్చాయి. దాంతో తమన్నా మళ్లీ స్పీడ్ పెంచింది.

రీసెంటుగానే చూసుకుంటే తమన్నా ఒకే సమయంలో ఇటు చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలోను .. మరో వైపున రజనీ ‘జైలర్’ సినిమాలోను నటించింది. ఒక రోజు గ్యాప్ తో ఈ సినిమాలు థియేటర్లకు వచ్చాయి. ‘జైలర్’ సినిమాలో ఆమె పాత్ర రజనీ సరసన లేకపోయినా, ‘రా నువ్వు కావాలయ్యా’ పాట పాప్యులర్ కావడంతో, సినిమా సక్సెస్ లో తమన్నాకి కూడా కాస్త చెప్పుకోదగిన వాటానే దక్కింది. తమన్నా గ్లామర్ కూడా ఎంతమాత్రం తగ్గలేదని ఈ పాట నిరూపించింది.

ఇక తమన్నా ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన ‘జీ కర్దా’ వెబ్ సిరీస్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఒక రేంజ్ లో దూసుకుపోయింది. దాంతో ఇప్పుడు వెబ్ సిరీస్ లతో తమన్నా ఫుల్ బిజీగా మారిపోయింది.  సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో నటించడానికి తమన్నా ఎంతమాత్రం మొహమాటపడటం లేదు. ఈ విషయంలో వెనకడుగు వేయకపోవడం కూడా ఆమె బిజీ కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆమె చేసిన ‘ఆఖరి సచ్’ అనే వెబ్ సిరీస్, ఈ నెల 25వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో ఆమె ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్