Sunday, January 19, 2025
Homeసినిమాఆదిపురుష్‌ పై అదనంగా 100 కోట్ల భారం?

ఆదిపురుష్‌ పై అదనంగా 100 కోట్ల భారం?

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా నటిస్తోంది.  బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నాడు. ఈ భారీ, క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. టీజర్ కు డివైడ్ టాక్ రావడంతో రిలీజ్ ను వాయిదా వేశారని తెలిసింది.

అయితే.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు ఉన్నాయి. పోటీ ఎక్కువ ఉందని ఆదిపురుష్ వాయిదా పడిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద టీమ్ ఎక్కువ శ్రద్ధ పెట్టిందని.. వీఎఫ్ఎక్స్ కు మరింత మెరుగులు దిద్దడానికే వాయిదా వేస్తున్నట్లుగా తెలిసింది. నిజానికి ఆది పురుష్ టీజర్ పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. VFX నాసిరకంగా ఉన్నాయని.. కంప్యూటర్ గ్రాఫిక్స్ మరీ దారుణమని.. మోషన్ క్యాప్చర్ పిక్చర్ అని చెప్పి ఒక యానిమేషన్ సినిమాని వదులుతున్నారని రకరకాలుగా కామెంట్స్ చేసారు.

ఈ నేపథ్యంలో మంచి అవుట్ ఫుట్ తీసుకురావడం కోసం చిత్ర బృందం మళ్ళీ విజువల్స్ మీద వర్క్ చేయడానికి రెడీ అయ్యింది.ఈ వీఎఫ్ఎక్స్ పనుల కోసం నిర్మాతలకు అదనంగా 100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి దాదాపు 500 కోట్లు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో 100 కోట్లు అంటే.. బడ్జెట్ భారీగానే పెరుగుతుంది. అందుచేత ఈ బడ్జెట్ అంతా రావాలంటే.. ఆదిపురుష్‌ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : వివాదంలో ఆదిపురుష్‌. ఇంత‌కీ ఏమైంది?

RELATED ARTICLES

Most Popular

న్యూస్