Monday, September 23, 2024
HomeTrending Newsప్రతి నియోజకవర్గంలో అధునాతన కూరగాయల మార్కెట్లు

ప్రతి నియోజకవర్గంలో అధునాతన కూరగాయల మార్కెట్లు

హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్‌ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు.
చాలా కూరగాయల మార్కెట్లు అనుకున్నంత పరిశుభ్రంగా లేవని సీఎం కేసీఆర్‌ అన్నారు. మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈనేపథ్యంలో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని తెలిపారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామన్నారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నారాయణపేట కూరగాయల మార్కెట్‌ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని చెప్పారు. కల్తీ విత్తనాల బెడద లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్