Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసెల్ ఫోన్ బాంబుతో జాగ్రత్త

సెల్ ఫోన్ బాంబుతో జాగ్రత్త

Danger Bells: ఢిల్లీలోని ఒక పాఠశాలలో ఐదుగురు 10వ తరగతి విద్యార్థులు, ప్లాన్ చేసి ఆన్లైన్ లో కత్తిని కొనుగోలు చేసి తోటి విద్యార్థిని హత్య చేశారు .

మరో ఘటనలో, పన్నెండేళ్లయినా నిండని విద్యార్థులు , తమ తోటి విద్యార్ధిని రేప్ చేసి కిరాతకంగా చంపేశారు .

బీహార్ లో మార్కులు వేయలేదని టీచర్ ను చెట్టుకు కట్టి కొట్టిన విద్యార్థులు…

ఢిల్లీ లో టీచర్ తిట్టాడని, ఆయన్ని కాల్చి చంపిన విద్యార్ధి…..

తమిళనాడులో విద్యార్థులు మారణాయుధాలు క్లాస్ కు తెస్తున్నారని, వారినుంచి తమకు రక్షణ కల్పించాలని ధర్నా చేసిన అనేక ప్రభుత్వ పాఠశాలల టీచర్ లు .

రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు తమపై ఎక్కడ కేసులు పెడతారేమో అని భయపడి , వారిని కనీసం మందలించడం కూడా మానేసిన టీచర్లు ఎంతో మంది !

Children Mobile Phones

ఇవన్నీ ఇటీవలి కాలంలో జరిగిన ఘటనలు…. ఏమి జరుగుతోంది ?

ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ కి అమ్ముడు పోయి/ వారి విష ప్రచారానికి భయపడి, పాఠశాలల్ని దాదాపుగా రెండేళ్లు మూసేసిన దౌర్భాగ్య స్థితి . పిల్లలు ఇంట్లో బందీలయ్యారు . సామాజిక జీవననానికి దూరం అయ్యారు .

2014 సంవత్సరం నుంచి అతి తక్కువ ధరకే మొబైల్ద్ డాటా ప్లాన్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పుడే సెల్ ఫోన్ ప్రతి బిడ్డ చేతికి వెళ్ళిపోయింది . మూడేళ్ళ తమ బిడ్డ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తుంటే” అబ్బా! ఎంత టెక్ సావీ నో… “ అంటూ మురిసిపోయే అమాయక తల్లితండ్రులు .

ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాలం లో ఇది బాగా ముదిరింది . లాక్ డౌన్ ఎత్తేయడంతోటే తల్లితండ్రులు పనిలో పడ్డారు. పిల్లలేమో ఇంట్లో. ఆన్లైన్ ఎడ్యుకేషన్ పేరుతొ వారి చేతిలో సెల్ ఫోన్ .

ఇరవై అయిదేళ్ల లోపు వారిలో మెదడు ముందు భాగం { ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ } సరిగా అభివృద్ధి కాదు . దీని వల్ల వారిలో భావోద్వేగాల నియంత్రణ , ఆత్మ నియంత్రణ , విచక్షణా జ్ఞానం బాగా తక్కువ. ఒక వ్యసనం బారిన పడితే నిలవరించుకోవడం దాదాపుగా అసాధ్యం. అందుకే మద్యం, అడల్ట్ సినిమాలు పిల్లలకు దూరం అని నిబంధనలు ఉన్నాయి.

సెల్ ఫోన్ దోమలాంటిది . దోమ కాటు వల్ల మలేరియా , డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకే అవకాశముంది. సెల్ ఫోన్ వల్ల ముక్కుపచ్చలారని పిల్లలు, నీలి చిత్రాలకు , హింసాత్మక వీడియోలకు అలవాటు పడిపోయారు . వాట్సాప్/ ఇంస్టాగ్రామ్ గ్రూప్ లు ఏర్పరచుకొని ఒకరినొకరు చెడ గొట్టుకొంటున్నారు. చంపడం, చావడం, ఆత్మ హత్య, హింస, రేప్, స్వలింగ సంపర్కం, వావివరుసలు మరిచి సెక్స్ చేయడం తాగడం, సిగరెట్లు, హుక్కా పీల్చడం, గంజాయి ఇంకా ఇతర డ్రగ్స్ తీసుకోవడం… ఇంటర్ నెట్ ద్వారా కొందరు పిల్లలు నేర్చుకుంటున్న అంశాలు. కోట్లాది పిల్లలు ఇప్పటికే ఈ దారిలో పడిపోయారు. వారిని బాగు చేయలేక సైకియాట్రిస్ట్ లు చేతులెత్తేస్తున్నారు.

తమ పిలల్లు చాలా అమాయకులు అనే భ్రమలో తల్లితండ్రులు ఉంటున్నారు.  రాజకీయ పార్టీలకు ఇవన్నీ పట్టవు. విద్యార్ధి లోకాన్ని బాగుచేస్తే ఓట్లు రాలుతాయా? పిలల్లు సెల్ ఫోన్స్ వాడడం వల్ల సెల్ ఫోన్ కంపెనీలకు, సాఫ్ట్ వేర్ కంపెనీ లకు కోట్లాది రూపాయిల వ్యాపారం. ఒక్క ఆన్లైన్ గేమింగ్ వ్యాపారమే బిలియన్ డాలర్స్ గా వుంది . ఇది కాకుండా సెల్ ఫోన్ హార్డ్ వేర్ .. డేటా ప్లాన్స్. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వీటన్నిటికీ గండి పడుతుంది. కాబట్టి దీని గురించి ఎవరూ ఆలోచించకుండా,  చేసినా కన్ఫ్యుస్ చేసే .. స్పాన్సర్డ్ ప్రచారాలు. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు .

ఈ కాలం పిల్లలకు సెల్ ఫోన్ లేకపొతే ఎలా టెక్నాలజీ కి దూరం కారా? అంటూ దొంగమాటలు. బ్లేడ్ తో షేవింగ్ చేసుకోవచ్చు. గొంతు కూడా కోయెచ్చు. టెక్నాలజీ నీకు బానిస కావాలి. టెక్నాలజీకి నీవు బానిస కావలసిందే అంటే ఎలా? ఇంట్లో, పాఠశాలలో డెస్క్ టాప్ .. దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ .. తల్లితండ్రులు, టీచర్ ల పర్యవేక్షణలో వారు తమకు కావలసిన సమాచారాన్ని నెట్ ద్వారా సేకరించే అవకాశం కలిపించొచ్చు .

ఆలా కాకుండా సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే .. వారు దుప్పట్లో , బాత్ రూమ్ లో, మేడపైన .. ముందుగా ఇలా .. అటుపై బరి తెగించి తలుపు వేసుకొని మరీ నీలి చిత్రాలు చూస్తారు . హింసాత్మక వీడియోలకు అలవాటు పడిపోతారు. ఇప్పటికే కోట్లాది మంది పిల్లలు ఈ ఊబిలో ఉన్నారు.  సెల్ ఫోన్ వ్యసనంవల్ల లక్షలాది పిల్లల మెదళ్ళు దెబ్బతింటున్నాయి. మెదడులోని గ్రే మేటర్, వైట్ మేటర్ క్షీణించి పోవడం వల్ల వారు ADHD లాంటి మానసిక వ్యాధులకు గురవుతున్నారు .

సెల్ ఫోన్ నీలి కాంతి వల్ల కంటి చూపు ను పూర్తిగా లేదా పాక్షికంగా కోల్పోతున్న పిలల్లు కోట్లాది మంది .

Children Mobile Phones

సెల్ ఫోన్  వీడియో గేమ్స్ ఆడడం వల్ల గేమర్స్ థంబ్ (బొటన వేలు దెబ్బ తినడం);  ట్రిగ్గర్ ఫింగర్ (మిగతా వేళ్ళు దెబ్బ తినడం); కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (ముంజేయి నరాలు దెబ్బ తినడం); టెన్నిస్ ఎల్బో  (మోచేయి నరాలు దెబ్బ తినడం); డ్రాపింగ్ షోల్డర్స్ (భుజాలు ముందుకు వంగిపోవడం); డ్రాపింగ్ హెడ్ సిండ్రోమ్ (తల ముందుకు వంగి పోవడం); మెడ , వెన్నెముక దెబ్బ తినడం… ఇలా అనేక సరికొత్త ఆరోగ్య సమస్యలు .. మానసిక సమస్యలు . ఒకరో ఇద్దరో కాదు .. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలు ఈ వ్యాధులతో సతమతమవుతున్నారు.  సెల్ ఫోన్ పిల్లల చేతిలో టైం బాంబు- అది కచ్చితంగా పేలుతుంది. ఈరోజా? రేపా ? అటుపైనా? అనేదే ప్రశ్న.

పిల్లలు దేవుడు చల్లని వారే .. కానీ కల్లకపటమెరుగని పిల్లలను బాల రాక్షసులుగా మారుస్తోంది హెల్ ఫోన్. మీ పిలల్లను సొల్లు ఫోన్ మహమ్మారి నుంచి రక్షించుకోండి. టీచర్ లు పాఠశాల ల మానేజ్మెంట్లు , తల్లితండ్రులు .. వీరందరి సమిష్టి బాధ్యత ఇది . ఇది జరగక్క పొతే నేరాలు ఘోరాలు ఖాయం. ఏ తల్లి తండ్రి…. ఏ టీచర్ ….ఏ బిడ్డ సేఫ్ కాదు. జాగ్రత్త పడకపోతే వినాశనం తప్పదు .

-వాసిరెడ్డి అమర్ నాథ్

Also Read :

డిజిటల్ విధ్వంసం

Also Read :

ఐ ఐ టి విద్యార్థి ఆత్మహత్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్