Saturday, January 18, 2025
Homeసినిమాహరీష్ శంకర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ?

హరీష్ శంకర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ?

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ త‌ర్వాత ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ చిత్రంలో న‌టించాలి. అయితే.. లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ ఆగిపోయింద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి చాలా బ‌డ్జెట్ కావాలి. లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ఈ సినిమా పై అంత బ‌డ్జెట్ వ‌ర్కవుట్ కాదు. పైగా విజ‌య్ కూడా ఈ సినిమాపై అంత‌ ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేద‌ట‌.

ప్ర‌స్తుతం విజ‌య్ ‘ఖుషి‘ సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఈ మూవీ డ‌బ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత  హ‌రీష్ శంక‌ర్ తో విజయ్  సినిమా చేసే అవకాశం ఉంది. హరీష్ ప్రస్తుతం పవన్ క‌ళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయాలని ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుందో క్లారిటీ లేదు.

అందుచేత విజ‌య్ తో మూవీ చేయ‌డానికి హ‌రీష్ ఓకే చెప్పార‌ని స‌మాచారం. విజ‌య్, హ‌రీష్ శంక‌ర్ ఇద్ద‌రినీ దిల్ రాజు క‌లిపార‌ని టాక్. ప్ర‌స్తుతం క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే.. ఈ సినిమాను తెలుగులోనే చేస్తారా..?  పాన్ ఇండియా మూవీగా చేస్తారా..?  అనేది తెలియాల్సివుంది.

Also Read : టెన్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్