టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్‘ దసరా కానుకగా నిన్న విడుదలైంది. అయితే.. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. నాగార్జున యాక్షన్ సీన్స్ బాగున్నాయని, హాలీవుడ్ మూవీని చూసిన ఫీలింగ్ కలిగిందనే టాక్ వచ్చింది. కొత్త తరహా యాక్షన్ సీన్స్ ను చూపించారు. అంతబాగానే ఉంది కానీ.. యాక్షన్ పార్ట్ ఎక్కువ అయ్యిందనే టాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత నాగార్జున మరో యాక్షన్ మూవీ చేయాలనుకున్నారు. ఇందులో నాగార్జునతో పాటు అఖిల్ కూడా నటించనున్నాడు.
ఈ భారీ యాక్షన్ మూవీకి ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ మోహనరాజా డైరెక్టర్. త్వరలో ఈ సినిమాని అనౌన్స్ చేయాలనుకున్నారు. అయితే.. ది ఘోస్ట్ మూవీకి మిక్సడ్ టాక్ రావడంతో మళ్లీ నాగార్జున యాక్షన్ మూవీ చేస్తారా..? లేక ఎంటర్ టైన్మెంట్ మూవీ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ది ఘోస్ట్ ఎఫెక్ట్ తో నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.