Sunday, January 19, 2025
Homeసినిమాబాబీ కష్టం చూసి ఆయనకి అభిమానిగా మారిపోయాను: మెగాస్టార్ 

బాబీ కష్టం చూసి ఆయనకి అభిమానిగా మారిపోయాను: మెగాస్టార్ 

చిరంజీవి – బాబీ కాంబినేషన్లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా, ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘వైజాగ్’ లో జరిగింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. బాబీ తన అభిమాని కనుక తాను అవకాశం ఇవ్వలేదనీ, ఆయన టాలెంట్ ను చూసే ఛాన్స్ ఇచ్ఛానని అన్నారు. బాబీ ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దాడనీ, ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని చెప్పారు. రెండేళ్లుగా ఆయన పడిన కష్టం చూసిన తాను  ఆయనకి అభిమానిగా మారిపోయానని అన్నారు.

ఇక బాబీ మాట్లాడుతూ .. తన తండ్రి చిరంజీవిగారికి వీరాభిమాని అనీ, తాను చిరంజీవిగారితో సినిమా చేయడం ఆయన కల అని అన్నారు. ఆ కల నెరవేరడానికి 20 ఏళ్లు పట్టిందని చెప్పారు. చిరంజీవిగారికి కోపం రావడం తాను చూడలేదనీ, ఆ విషయాన్ని గురించి అడిగితే ఆయన చెప్పిన సమాధానం తనని ఆలోచనలో పడేసిందని  అన్నారు. మెగాస్టార్ లోని ఆవేశం .. మంచితనం రెండూ కూడా పవన్ కల్యాణ్ కి వచ్చాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ .. అన్నయ్యే తమ అందరికీ స్ఫూర్తి అనీ, ఆయనను చూసే తాము ఇండస్ట్రీకి వచ్చామని అన్నారు. అన్నయ్యతో ఒక్క సినిమా అయినా చేయాలనే ఉద్దేశంతోనే  బాబీ డైరెక్టర్ అయితే, అన్నయ్య మాదిరిగా స్టార్ కావాలనే పట్టుదలతో రవితేజ ఇండస్ట్రీకి వచ్చారని చెప్పారు. ఇక తాను మెగా డాన్సులు చూసే మ్యూజిక్ డైరెక్టర్ ను అయ్యానని అన్నారు. ఇలా మెగా అభిమానులంతా కలిసి చేసిన సినిమా ఇదనీ .. ఈ సంక్రాంతికి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్