Sunday, January 19, 2025
Homeసినిమాఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Agent: అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అఖిల్, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. దీంతో అఖిల్ నాలుగ‌వ సినిమా అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీ పై అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ స‌క్స‌స్ సాధించింది. అఖిల్ కి తొలి విజ‌యాన్ని అందించింది.

ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమా పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. కార‌ణం ఏంటంటే.. ఇటీవ‌ల రిలీజ్ చేసిన అఖిల్ స్టిల్స్ చూస్తుంటే.. ఈ సినిమా కోసం ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నాడో అర్థం అవుతుంది. అలాగే వైజాగ్ లో షూటింగ్ చేస్తున్న ఇంట‌ర్వెల్ సీన్ కు సంబంధించి వీడియో లీకైంది. ఆ వీడియో చూసిన జ‌నాలు అయితే.. ఏజెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయం అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఏజెంట్ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఎప్పుడంటే.. మే 12న ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. స‌ర్కారు వారి పాట థియేట‌ర్ల‌లో ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ కానుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. త్వ‌ర‌లోనే ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ గురించి అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి

Also Read : కులుమనాలి లో ‘ఏజెంట్’ ఏం చేస్తాడో?

RELATED ARTICLES

Most Popular

న్యూస్