Monday, March 17, 2025
HomeTrending NewsHyderabad Airport: విమానాలు రద్దు.. ప్రయాణికుల వెతలు

Hyderabad Airport: విమానాలు రద్దు.. ప్రయాణికుల వెతలు

హైదరాబాద్‌ నగరంలోని శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన విమానాలను ఎయిర్‌ ఇండియా రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సమాచారాన్ని ప్రయాణికులకు అందించకపోవడంతో.. సోమవారం తెల్లవారుజామున 40 మంది ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చారు. తాము వెళ్లాల్సిన విమానం ఎంతకూ రాకపోవడంతో సంబంధిత అధికారులను నిలదీశారు.

దీంతో హైదరాబాద్‌ నుంచి తిరుపతి, బెంగళూరు, విశాఖపట్నం, మైసురు వెళ్లాల్సిన విమానాలను, చెన్నై, తిరుపతి, బెంగళూరు, మైసూరు నుంచి నగరానికి రావాల్సిన విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించారు. ముందుగానే తమకు సమాచారం అందించకుండా తమ సమయం వృథా చేశారంటూ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో వారు అక్కడినుంచి వెనుతిరిగారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్