Sunday, January 19, 2025
Homeసినిమా‘అఖండ’ 25 రోజుల వేడుక

‘అఖండ’ 25 రోజుల వేడుక

Akhanda 25 days:
న‌ట‌సింహ‌ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అఖండ చిత్రంతో మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద అఖండ ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. అఖండ విడుదలై 25 రోజులైన ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. నాలుగో వారంలో కూడా అఖండ భారీ కలెక్షన్లు రాబట్టింది. అఖండ భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది.

ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా చిత్రయూనిట్ పాల్గొంది. ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. చిత్రయూనిట్ కు సక్సెస్ షీల్డ్‌ ను అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ లో పాల్గొన్నారు.

2021లో అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అఖండ విడుదలైన అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ విజయంతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయి. మాస్ సబ్జెక్ట్‌ ను హ్యాండిల్ చేయడంలో బోయపాటి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించారు.

Also Read : ‘అఖండ’కు  బాల‌య్య కెరీర్లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్