Sunday, January 19, 2025
Homeసినిమాద‌స‌రా బ‌రిలో ఏజెంట్.?

ద‌స‌రా బ‌రిలో ఏజెంట్.?

For Dasara: అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఏజెంట్‘. ఈ భారీ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంక‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఆమ‌ధ్య వైజాగ్ లో యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌రించారు. ఆత‌ర్వాత మ‌నాలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ఇదిలా ఉంటే.. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా అధికారికంగా ప్ర‌క‌టించారు కానీ.. షూటింగ్ ఇంకా చేయాల్సివుండ‌డంతో విడుద‌ల వాయిదా ప‌డ‌నుంద‌ని గత కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై అనిల్ సుంక‌ర్ ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌ద్దు. అఫిషియ‌ల్ గా చెప్పిన‌వే న‌మ్మండి అన్నారు.

నిర్మాత ఇలా చెప్ప‌డంతో ఆగ‌ష్టు 12న ఏజెంట్ విడుద‌ల అవుతుంది అనుకున్నారు. అయితే.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఏజెంట్ ఆగ‌ష్టు 12న రావ‌డం లేద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం మాత్ర‌మే షూటింగ్ అయ్యింద‌ట‌. అందుచేత‌ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో ఏజెంట్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నార‌ట. మ‌రి.. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read : పోటీకి సై అంటోన్న‌ అఖిల్, నితిన్, స‌మంత‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్