Sunday, January 19, 2025
HomeసినిమాAkhil Akkineni: ఆ ముగ్గురికీ అఖిల్ గ్రీన్ సిగ్నల్?

Akhil Akkineni: ఆ ముగ్గురికీ అఖిల్ గ్రీన్ సిగ్నల్?

‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో అఖిల్ డీలా పడ్డాడు. దుబాయ్ వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాడు.  తర్వాత ఏమిటనేది  ఆసక్తిగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ. క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ద్వారా అనిల్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని తెలిసింది.

ఈ సినిమాతో పాటు వంశీ పైడిపల్లి పేరు వినిపిస్తుంది. నాగార్జునతో తెలుగు, తమిళ్ లో ఊపిరి సినిమా వంశీ చేశాడు.  ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇటీవల విజయ్ తో వారసుడు ద్విభాషా సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు అఖిల్ తో వంశీ పైడిపల్లి మూవీ సెట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన శ్రీకాంత్ ఓదెల కూడా అఖిల్ కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. మొత్తానికి అఖిల్ రూటు మార్చి వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్