Sunday, January 19, 2025
HomeసినిమాAkhil: అఖిల్ పునరాలోచన?

Akhil: అఖిల్ పునరాలోచన?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  అక్కినేని అఖిల్  నటించి ఇటీవల విడుదలైన  ‘ఏజెంట్’ సినిమా  ఏమాత్రం ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దీంతో బాగా డీలా పడ్డ అఖిల్ రిలాక్స్  కోసం  దుబాయ్ వెళ్ళారు.  హైదరాబాద్ వచ్చాడు కానీ.. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ లో ఇక నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తానని అనౌన్స్ చేశాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అఖిల్ ఆలోచనలో పడ్డాడని టాక్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే.. ఈ చిత్రానికి 150 కోట్లు బడ్జెట్ అనుకున్నారట. పైగా కొత్త దర్శకుడు అనిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలిసింది. 80 కోట్లు పెట్టి తీసిన ఏజెంట్ సినిమానే డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి టైమ్ లో 150 కోట్లు బడ్జెట్ అంటే రిస్క్ అని ఆలోచిస్తున్నాడట. అభిమానులు కూడా అంత బడ్జెట్ తో సినిమా తీసే కంటే.. మినిమం బడ్జెట్ లో సినిమా తీసి హిట్ కొడితే బాగుంటుంది. ఆ తర్వాత భారీ బడ్జెట్ లో సినిమా తీయచ్చు అని అంటున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అనిపిస్తుంది.

అందుకనే బడ్జెట్ విషయంలో ఆలోచనలో పడ్డారని తెలిసింది. ఈ సినిమాతో పాటు దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. అలాగే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వంశీ కూడా అఖిల్ కి సరిగ్గా సరిపోయే కథ రెడీ చేస్తున్నాడట. అందుచేత ఇమ్మిడియట్ గా సక్సెస్ సాధించాలి అంటే ఎవరితో సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నాడట. ఏది ఏమైనా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త్వరలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయాలి. మరి.. ఈసారైనా అఖిల్ ఆశించిన సక్సెస్ సాదిస్తాడో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్