Monday, April 15, 2024
HomeసినిమాRam Charan: హాలీవుడ్ మేకర్స్ కి చరణ్ ఏం చెప్పాడు?

Ram Charan: హాలీవుడ్ మేకర్స్ కి చరణ్ ఏం చెప్పాడు?

రామ్ చరణ్‌ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి టాలీవుడ్, బాలీవుడ్ నే కాదు హాలీవుడ్ ని కూడా మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వెళ్లినప్పుడు హాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఓ ఇంటర్ వ్యూలో హాలీవుడ్  సినిమాలపై కథాచర్చలు జరుగుతున్నాయని  వెల్లడించాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల చరణ్‌ మాట్లాడుతూ.. ఇండియాలో ఎన్నో అందమైన లోకేషన్లు ఉన్నాయని, కేరళ, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ప్రకృతి ఎంతో బాగుంటుందని, షూటింగ్ లకు  ఎంతో అనుకూలమని,  మన దేశంలోని అందమైన ప్రదేశాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.  అందుకనే తను నటించే సినిమాలలోని ఎక్కువ భాగం  ఇండియాలోనే షూటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కేవలం లోకేషన్ల కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను అని కూడా చెప్పారు.

“హాలీవుడ్ సినిమాల్లో నటించినా అక్కడ దర్శకులకు ఇండియా అందాలు చూపిస్తాను. మన దేశంలో షూటింగ్ చేయాలని కండీషన్ పెడతాను. అలా చేయడానికి ఒప్పుకుంటేనే సినిమా చేస్తా”నని  అన్నారు. అలాగే సౌత్ సినిమా, నార్త్ సినిమా అని వేరుగా లేవు. ఉన్నది ఒక్కటే ఇండియన్ సినిమా అని.. ఆర్ఆర్ఆర్ సినిమాతో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. చరణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి.. త్వరలో హాలీవుడ్ మూవీని అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్