Sunday, January 19, 2025
Homeసినిమారాజమౌళిని అభినందించిన నాగార్జున

రాజమౌళిని అభినందించిన నాగార్జున

‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసి సంచలనం సృష్టించిన రాజమౌళి. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బాలీవుడ్ మాత్రమే కాదు.. హాలీవుడ్ కూడా తనవైపు చూసేలా చేసి చరిత్ర సృష్టించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో నట విశ్వరూపం చూపిస్తే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నట విశ్వరూపం చూపించారు. ఈ భారీ, క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

ఇటీవల జపాన్ లో రిలీజ్ చేస్తే.. అక్కడ కూడా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. 25 ఏళ్లుగా రజనీకాంత్ పేరుతో ఉన్న ముత్తు సినిమా రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే హాలీవుడ్ సహా అనేక దేశాలు, భాషల ఆడియన్స్ నుండి గొప్ప ప్రసంశలు అందుకుంటూ దూసుకెళ్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి మరో వైపు పలు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం లభిస్తున్నాయి. అయితే విషయం ఏమిటంటే… ఈ సినిమాకి గాను దర్శకుడు రాజమౌళికి హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించడంతో దానిని స్వీకరించేందుకు రాజమౌళి కుటుంబంతో పాటు హీరో రామ్ చరణ్, ఉపాసన కూడా ప్రత్యేకంగా న్యూయార్క్ వెళ్లారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డుని రాజమౌళి దక్కించుకోవడంతో ఆయన అద్భుత దర్శకత్వ ప్రతిభని పలువురు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున, తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా రాజమౌళి అండ్ టీమ్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తూ ఎమోజిలు పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం మీడియా మాద్యమాల్లో వైరల్ అవుతోంది. నాగార్జున అభినందనలకు థ్యాంక్యూ సో మచ్ సార్ అంటూ జక్కన్న రిప్లై ఇచ్చాడు. మరి.. రాబోయే రోజుల్లో రాజమౌళి ఇంకెన్ని అవార్డులు గెలుచుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్