Sunday, January 19, 2025
Homeసినిమానాగార్జున న్యూమూవీ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

నాగార్జున న్యూమూవీ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ మూవీతో గత సంవత్సరం దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత నెక్ట్స్ మూవీని వెంటనే ప్రకటించేస్తాను అన్నారు. అదిగో అనౌన్స్ మెంట్.. ఇదిగో అనౌన్స్ మెంట్ అని వార్తలు వచ్చాయి కానీ.. కొత్త సినిమా కబురు మాత్రం రాలేదు. రైటర్ బెజవాడ ప్రసన్నను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించాలి అనుకున్నారు. దీని గురించి ఇంత వరకు అప్ డేట్ లేదు.

ఆతర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో నాగార్జున సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా రాలేదు. దీంతో అక్కినేని అభిమానులు ఇంకెప్పుడు నాగార్జున సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఊహించని విధంగా నాగార్జున సినిమా గురించి కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. విషయం ఏంటంటే… ధనుష్ తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

అయితే.. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ముందుగా ఓ గెస్ట్ రోల్ రాసుకున్నారట. ఇప్పుడు ఆ గెస్ట్ రోల్ ను కాస్తా కీలక పాత్రగా మార్చారని ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలిసింది. నాగార్జున, ధనుష్ కలిసి సినిమా చేస్తే ఆ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు ఏర్పడడం ఖాయం. మరి.. ఇందులో నాగార్జున నటిస్తున్నట్టుగా ఎప్పుడు ప్రకటిస్తారంటే.. నాగ్ పుట్టినరోజున అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్