ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో ‘వార్ 2’ మూవీని ప్రకటించడంతో ఈ సినిమా పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ ఇయర్ ఎండ్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీ.. కాంబోలో వార్ 2 అని ప్రకటించారు కానీ… హీరోయిన్స్ ఎవరు అని ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్ కు జంటగా నటించేది ఎవరు..? హృతిక్ కి జంటగా నటించేది ఎవరు..? అనేది ఆసక్తిగా మారింది.
అయితే… బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ వార్ 2 లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే… బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే కూడా వార్ 2 లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆలియా, దీపికా ఎవరెవరికి జంటగా నటిస్తారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. హృతిక్ రోషన్ కి జంటగా దీపికా పడుకునే అని నటించనుందని.. ఇక ఎన్టీఆర్ కు జంటగా ఆలియా భట్ నటించనుందని టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే… ప్రస్తుతం ఇంకా పరిశీలనలోనే ఉందని… ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదని కూడా బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
తాజా కథనాల ప్రకారం… ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో పోటీపడుతూ ధీటైన పాత్రలో ఎన్టీఆర్ నటిస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్ ని టచ్ చేస్తాయని హృతిక్- ఎన్టీఆర్ లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో నటిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి… ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందేమో చూడాలి.