మధ్యప్రదేశ్ లో పన్నా జిల్లా. ఖాందియా ప్రాంతంలో విజయ్ కుమార్ ఛాన్సోరియా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. రిక్షాలు తొక్కి, కూలి పనులు చేస్తూ చదువుకుని ఉపాధ్యాయుడయిన విజయ్ ఇప్పుడు జాతీయ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
39 ఏళ్ల ఉపాధ్యాయ ఉద్యోగ జీవితంలో కూడబెట్టుకున్నది, పి ఎఫ్, గ్రాచ్యూటి అంతా కలిపి 40 లక్షల రూపాయలను పేద విద్యార్థులు చదువుల కోసం విరాళంగా ఇచ్చారు. పదవీ విరమణ వేళ ఆయన తనవంతు సాయాన్ని అందజేశారు. ఇంట్లో భార్య, పిల్లల సమ్మతితోనే తను ఈ విరాళమిస్తున్నట్లు ప్రకటించారు.
చదువంటే ఆసక్తి ఉన్న నిరుపేదలకోసం తను చేయగలిగిన సాయం చేశానని వినయంగా చెప్పుకుంటున్న విజయ్ ఆదర్శానికి జనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.
Also Read : సంక్షోభంలో సంపద పాఠం