Sunday, January 19, 2025
Homeసినిమాపీరియాడికల్‌ డ్రామాగా అల్లు అర్జున్ చిత్రం

పీరియాడికల్‌ డ్రామాగా అల్లు అర్జున్ చిత్రం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున చిత్రం ‘పుష్ప2’ వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న విషయం కూడా విదితమే. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ వెలుగు చూసింది. హారిక-హాసినీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పీరియాడికల్‌ డ్రామాగా స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నదనే వార్త గతంలోనే వినిపించింది. ఆ వార్తకు బలాన్నిస్తూ, రూ. 300 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మించనున్నారని తెలిసింది.పాన్‌ వరల్డ్‌ మూవీగా ఈ సినిమా నిర్మించనున్నారట. ‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న ఈ చిత్రానికి యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండేలా త్రివిక్రమ్‌ జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా త్రిషను తీసుకోనున్నారట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్