Sunday, January 19, 2025
Homeసినిమాబ‌న్నీ, బోయ‌పాటి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

బ‌న్నీ, బోయ‌పాటి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Bunny-Boyapati: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల పుష్ప సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సక్సెస్ సాధిచ‌డం తెలిసిందే. ఇది బ‌న్నీ న‌టించిన ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. దీంతో పుష్ప నార్త్ లో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది..?  ఎలాంటి స‌క్స‌స్ సాధిస్తుందో..? అని అభిమానుల‌తో పాటు పుష్ప మేక‌ర్స్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే.. బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ పుష్ప దాదాపు 70 కోట్లు క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ట్రేడ్ పండితుల‌కు సైతం షాక్ ఇచ్చింది.

పుష్ప బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో బన్నీ త‌దుప‌రి చిత్రాల పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. పుష్ప త‌ర్వాత బ‌న్నీ పుష్ప 2 చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ చేయ‌నున్నారు. ద‌స‌రాకి కానీ.. డిసెంబ‌ర్ కి కానీ.. విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ.. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయ‌నున్నాడు. గ‌తంలో బ‌న్నీ, బోయ‌పాటి క‌లిసి ‘స‌రైనోడు’ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ సక్సెస్ సాధించింది.

రీసెంట్ గా బోయ‌పాటి.. నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’.. బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ అయ్యింది,.  ఇప్పుడు బన్నీ, బోయపాటి క‌లిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీని చేయబోతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటంటే.. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందనున్న ఈ మూవీలో బన్నీ తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నార‌ని స‌మాచారం. రెండు పాత్ర‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. బ‌న్నీని.. ఈసారి బోయ‌పాటి ఎలా చూపించ‌నున్నారో..?

Also Read : హిందీలో 75 కోట్ల వసూళ్ళ దిశగా పుష్ప

RELATED ARTICLES

Most Popular

న్యూస్