Saturday, January 18, 2025
Homeసినిమామరోసారి ‘సరైనోడు’ కాంబినేషన్

మరోసారి ‘సరైనోడు’ కాంబినేషన్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ ఈ ఏడాది చివరికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ పుష్ప తర్వాత చేసే సినిమా ఎవరితో అనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. అయితే.. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్, కోలీవుడ్ డైరెక్టర్ మురుగుదాస్ లతో బన్నీ కథా చర్చలు జరిపినట్టు తెలిసింది. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా కథా చర్చలు జరిగాయి.

ఇటీవల వంశీ పైడిపల్లి కూడా బన్నీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇలా బన్నీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నారంటూ రోజుకో డైరెక్టర్ పేరు తెర పైకి వస్తుంది. తాజాగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారని తెలిసింది. బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో అఖండ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ తో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిందని సమాచారం. బన్నీ, బోయపాటి కలిసి సరైనోడు సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో బోయపాటితో మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఆయనకు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.

బన్నీతో సినిమా చేసేందుకు ఇటీవల బోయపాటి శ్రీను రెండుసార్లు అల్లు అరవింద్ ను కలవడం జరిగిందట. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే బోయపాటి బన్నీకి కథ చెప్పనున్నారని తెలిసింది. మరి.. బన్నీని మెప్పిస్తే.. మరోసారి సరైనోడు కాంబినేషన్ సెట్ కావడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్