Sunday, November 24, 2024
HomeTrending Newsభారత్ లో అమెజాన్ ఎయిర్ సర్వీసులు

భారత్ లో అమెజాన్ ఎయిర్ సర్వీసులు

భారతీయ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే.. అమెజాన్ ఎయిర్ సర్వీసు. అమెజాన్ ఎయిర్ సర్వీసుల ద్వారా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల వినియోగదారులకు వేగంగా డెలివరీని అందించడానికి సాయపడుతుంది. రిటైలర్ బెంగళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌ తో భాగస్వామ్యాన్ని అమెజాన్ కుదుర్చుకుంది. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దేశంలో అమెజాన్ సొంత ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించింది. ఎయిర్ సర్వీసుల ద్వారా చాలా వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలు కల్పిస్తుందని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అమెజాన్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులను పొందుతున్న మార్కెట్లలో భారత్ మూడోవది. అమెజాన్ ఎయిర్ మొదటిసారిగా 2016లో అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత యూరప్‌. భారతీయ మార్కెట్‌లో రెండు కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి 20వేల ప్యాకేజీలను అందించగలదని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. అమెజాన్ ఎయిర్ సర్వీసు భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

Amazon Airలో పెట్టుబడుల ద్వారా భారత్‌లో కస్టమర్‌లకు డెలివరీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ సర్వీసు ద్వారా భారత్‌లోని 1.1 మిలియన్లకు పైగా అమ్మకందారులకు సపోర్టు అందిస్తుంది. రవాణాతో పాటు విమానయానం వంటి అనుబంధ వ్యాపారాల వృద్ధికి మరింత వీలు కల్పిస్తుందని అమెజాన్‌లో కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు. అమెజాన్ డెలివరీ సర్వీసు కోసం బోయింగ్ 737-800 విమానాన్ని వినియోగించుకుంటుంది.

Also Read : స్విట్జర్లాండ్ లో కేటీఆర్ కు ఘనస్వాగతం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్