అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ గత జులై నెలలో 17వ మహాసభలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తదనంతర పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల హోరు నడుస్తోంది. ఆటా చరిత్రలో అతిపెద్ద ఎలక్షన్ కి తెర లేవడంతో, స్లేట్, నాన్-స్లేట్ లేదా మిక్స్డ్-స్లేట్ వారు గెలుస్తారంటూ రకరకాలుగా ప్రచారం సాగుతోంది.
వివరాలలోకి వెళితే… ఆటా (ATA) లో ప్యాట్రన్, గ్రాండ్ ప్యాట్రన్ మరియు లైఫ్ కేటగిరీ అని మూడు రకాల బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తో మొత్తం 31 మంది ఉంటారు. ఆటా సభ్యత్వం ఉన్నవారు ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని వోట్ ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం ఈ 31 మంది సింపుల్ మెజారిటీ తో ఆటా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 16 లేదా 15 మంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) ని 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఇండియాలో సాధారణ ఓటర్లు ఒక రాష్ట్ర ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే, అనంతరం ఆ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నట్టన్నమాట.
Non-Slate Sample Ballot – Life
ఈ ఆటా ఎన్నికల్లో ప్యాట్రన్ కేటగిరీలో 3, గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో 3 మరియు లైఫ్ కేటగిరీలో 10 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్యాట్రన్ కేటగిరీలో దాదాపు 500 ఓటర్లు, గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో సుమారు 200 ఓటర్లు మరియు లైఫ్ కేటగిరీలో 12 వేల ఓటర్ల వరకు ఉన్నట్లు సమాచారం.
లైఫ్ కేటగిరీలో 10 పదవులకు 16 నామినేషన్స్, ప్యాట్రన్ కేటగిరీలో 3 పదవులకు 6 నామినేషన్స్ మరియు గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో 3 పదవులకు 5 నామినేషన్స్ రావడం, కొందరిని పోటీ నుంచి విరమింపజేసి ఏకాభిప్రాయానికి వచ్చేలా నామినేషన్ కమిటీ చేయలేకపోవడంతో కొంతమంది పోటీదారులను స్లేట్ రికమెండెడ్ అభ్యర్థులుగా సిఫార్సు చేస్తూ ఎలక్షన్ కమిటీకి పంపింది.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
Non-Slate Sample Ballot – Patron
ఎలాగైనా ఈసారి ఆటా అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కి ముందే ఒక ఆశావాహి పెద్ద ఎత్తున డబ్బులిచ్చి మరీ వేలల్లో ఆటాలో సభ్యుల్ని చేర్పించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తతంగం వెనుక ఆటా ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకునే ఒక మాజీ అధక్షుడు, ఒక వ్యవస్థాపక సభ్యుడు మరియు వారి వంగమాగదులు ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ వ్యవహారాన్ని అంతా ముందే పసిగట్టిన మరో వర్గం నామినేషన్ కమిటీ సిఫార్సు చేసిన స్లేట్ (Slate) అభ్యర్థుల్లో కొందరు ఆటా సంస్థకి అంతలా సేవ చేసినవారు కాదు కాబట్టి నాన్-స్లేట్ లోని కొందరికి మద్దతు ఇస్తున్నారు. దీంతో ఎలక్షన్ కమిటీ విడుదల చేసిన స్లేట్ కి బదులుగా మిక్స్డ్-స్లేట్ లేదా నాన్-స్లేట్ అంటూ అనధికారికంగా సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నాన్-స్లేట్ నమూనా బ్యాలెట్స్ మీకోసం.
Non-Slate Sample Ballot – Grand Patron
ఆటాలో ఇప్పటికి రెండు సార్లు ఎలక్షన్స్ (Elections) జరగగా, కొవిడ్ టైం లో జరిగిన గత ఎలక్షన్ ని పక్కన పెడితే ప్రస్తుత ఎలక్షన్ 30 సంవత్సరాల ఆటా చరిత్ర (ATA History) లోనే ఖర్చుతో కూడిన అతి పెద్ద ఎలక్షన్ అంటున్నారు అమెరికాలోని తెలుగువారు. డబ్బులిచ్చి ఆటాలో సభ్యులను చేర్పించే సంస్కృతి కూడా ఆటా చరిత్రలో మొట్టమొదటిసారే అట.
ముందుగా ఎలక్ట్రానిక్ వోటింగ్ (Electronic Voting) అనుకున్నప్పటికీ ఎలక్షన్ సాఫ్ట్వేర్ ఆటా రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసేలా లేకపోవడంతో ఎప్పటిలానే పేపర్ బ్యాలెట్స్ వైపు మొగ్గారు. ఎలక్షన్ కమిటీ డిసెంబర్ 15న ఆటా సభ్యులందరికీ బ్యాలెట్స్ పోస్ట్ చేసింది. అందరూ వోట్ వేసి ప్రీపెయిడ్ ఎన్వలప్ ద్వారా తిరిగి జనవరి 6 లోపు పంపించాలి.
Slate Sample Ballot – Life
అదేరోజు రాత్రి లేదా తెల్లారి జనవరి 7న కౌంటింగ్ పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు. అలాగే జనవరి 21న లాస్ వేగాస్ లో నిర్వహించే ఆటా బోర్డు మీటింగ్ లో (ATA Board Meeting) ఆటా తదుపరి అధ్యక్షులు మరియు కార్యవర్గం ప్రమాణస్వీకారం చేస్తారు.
డబ్బు పవర్ ఏమేరకు పనిచేస్తుంది, పనిచేసేవారు గెలుస్తారా, ఆటా కి కాబోయే అధ్యక్షులెవరు వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకో 15 రోజులు ఆగాల్సిందే.
Election Candidates
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఆటా (American Telugu Association) వెబ్సైట్ లింక్స్ ని సందర్శించి మెరుగైన అభ్యర్థులను ఎన్నుకొని ఆటా సంస్థ ఔన్నత్యాన్ని పెంచవలసిందిగా కోరుతున్నారు అమెరికాలోని తెలుగువారు.