Sunday, January 19, 2025
Homeసినిమాఅంచనాలు పెంచేసిన 'అమిగోస్' ట్రైలర్

అంచనాలు పెంచేసిన ‘అమిగోస్’ ట్రైలర్

కళ్యాణ్ రామ్, రాజేంద్రరెడ్డి చేసిన చిత్రం ‘అమిగోస్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు టీజర్ బాలయ్య నటించిన ‘ధర్మ క్షేత్రం’ సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అంటూ సాగే రీమిక్స్ సాంగ్ అమిగోస్ సినిమా పై భారీ అంచనాల్ని పెంచేశాయి.

అమిగోస్ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగానే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే… దట్టమైన అడవిలో ఎన్ ఐఏ బృందం భారీ కాన్వాయితో ఓ నొటోరియస్ క్రిమినల్ ని ఛేజ్ చేస్తూ వుంటుంది. అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించిన ఎన్ ఐఏ అతని కోసం గాలింపు మొదలు పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్వవకూడదని అధికారులు చెప్పుకుంటుంటారు. మరో పక్క హీరోయిన్ తో రొమాంటిక్ మూడ్ లో హీరో కళ్యాణ్‌ రామ్ ఎంట్రీ.. సోమాలియా కరువు బాధితుడిలా ఆకలి చూపులేంట్రా తినేస్తావా పిల్లని అంటూ బ్రహ్మాజీ అనడం.. నీలాంటి వాళ్లు నీ చుట్టు వెయ్యి మందున్నా ఇట్టే గుర్తు పట్టేస్తా.. అని హీరోయిన్ అనడంతో కళ్యాణ్‌ రామ్ సెకండ్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది.

అతను కూడా మీలానే వున్నాడు అంటూ హీరోయిన్ ఆశ్చర్యంగా అనడం.. కట్ చేస్తే ముగ్గురు కలిసి కనిపించడం.. మనిషిని పోలిన మనుషులు ఎదురు పడితే అరిష్టం.. అని కళ్యాణ్ రామ్ తల్లి చెబుతున్న మాటలు ఆసక్తికరంగా వున్నాయి. కళ్యాణ్‌ రామ్ తనలా వున్న మరో ఇద్దరితో మనం ఫ్రెండ్స్ కాదు.. బ్రదర్స్ అంతకన్నా కాదు.. జస్ట్ లుక్ లైక్స్.. యూ షుడ్ డై మై ఫ్రెండ్.. అని కళ్యాణ్ రామ్ అంటే ఓ రాక్షసుడిని తెచ్చి ఇంట్లో పెట్టావు కదరా అని అతని తండ్రి అనడం.. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ట్రైలర్ సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేసింది. అమిగోస్ మూవీతో కళ్యాణ్‌ రామ్ మరో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అనిపిస్తుంది. మరి.. కళ్యాణ్ రామ్ అమిగోస్ తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నాడు: కల్యాణ్ రామ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్