Tuesday, February 25, 2025
HomeTrending Newsమన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభం

మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభం

అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఎకో టూరిజం కార్యక్రమాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభంతో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో సఫారీ కోసం 8 వాహనాలను జెండా ఊపి మంత్రి  ప్రారంభించారు. మన్ననూరు వద్ద మరొక ఆరు కాటేజీలు ప్రారంభం (ట్రీ హౌజ్, మడ్ హౌజ్) చేయగా టైగర్ స్టేట్ ప్యాకేజ్ ఆన్ లైన్ లో చేసుకునేందుకు వీలుగా పోర్టల్ ప్రారంభం చేశారు.

పర్యాటకులకు సేవలు అందించేందుకు కొత్తగా శిక్షణను ఇచ్చిన గైడ్లను అందుబాటులోకి తెచ్చిన అటవీ శాఖ…అటవీ పర్యవేక్షణకు వీలుగా కొత్తగా 10 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పీ. రాములు, విప్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్ ఎం డోబ్రియాల్, FDC VC చంద్ర శేఖర్ రెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్