Sunday, January 19, 2025
HomeTrending Newsఅమృత్ సర్ లో కాంగ్రెస్ కు షాక్

అమృత్ సర్ లో కాంగ్రెస్ కు షాక్

ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకొని పోలింగ్ దగ్గర పడుతున్న వేళ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తలిగింది. అమృత్ సర్ మేయర్ కరం జిత్ సింగ్ రింటు ఈ రోజు అమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అమృత్ సర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్, పార్టీ పంజాబ్ శాఖ అధ్యక్షుడు భగవంత్  మాన్ ల సమక్షంలో ఆప్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.

అమృత్ సర్ నుంచి పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు పోటీ పడుతున్నారు. సిద్దు నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపులు జరగటం పార్టీ శ్రేణుల్ని నివ్వెరపరిచింది. పోలింగ్ మరో నాలుగు రోజులు ఉందనగా కీలకమైన స్థానంలో ఉన్న నేత పార్టీని వీడటం కాంగ్రెస్ కు ఇబ్బంది కర పరిణామమే అవుతుంది. పోలింగ్ సరళిపై ప్రభావం చూపుతుందని నేతలు ఆందోళన చెందుతున్నారు.

Also Read : ఎన్నికల వేళ యుపిలో కాంగ్రెస్ అభ్యర్థి జంప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్